Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సైరా' నుంచి రెహమాన్ తప్పుకోవడానికి కారణమిదేనట!

  • రూ. 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అడిగిన రెహమాన్
  • చక్కర్లు కొడుతున్న కొత్త వార్త
  • ఇంత వరకు స్పందించని సినీ యూనిట్
మెగాస్టార్ చిరంజీవి 'సైరా' సినిమాకు సంగీత దర్శకుడిగా మొదట రెహమాన్ ను అనుకున్న సంగతి తెలిసిందే. అయితే, రెహమాన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. బిజీగా ఉన్నందువల్ల, ఈ సినిమాకు డేట్లు ఇవ్వలేక పోయాడని... అందుకే సినిమా నుంచి తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అసలు కారణం వేరని సినీ జనాలు అంటున్నారు. 'సైరా' నుంచి తప్పుకున్న తర్వాత కోలీవుడ్ లో రెండు సినిమాలకు రెహమాన్ ఓకే చెప్పాడు. ఇప్పుడు ఇదే పలు అనుమానాలకు తావిచ్చింది.

'సైరా'కు రెహమాన్ చాలా ఎక్కువ రెమ్యునరేషన్ అడిగాడని... రేటు కుదరక పోవడంతోనే రెహమాన్ తప్పుకున్నాడంటూ తాజాగా కొత్త వార్త షికార్లు చేస్తోంది. ఈ సినిమాకు రెహమాన్ రూ. 10 కోట్ల దాకా అడిగాడట. అయితే, దీనిపై సినీ యూనిట్ నుంచి ఇంత వరకు ఎలాంటి స్పందన రాలేదు. 
saira
rehman

More Telugu News